ఆలేరు టౌన్, సెప్టెంబర్ 02 : రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్లు వెచ్చించి తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ దుష్ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆలేరు మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పర్ శంకరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పడం సీఎం రేవంత్ రెడ్డికి ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువగా పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ రాష్ట్రంగా చేసి రైతుల కండ్లలో ఆనందం నింపితే అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్, చివరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించడాన్ని వారు తీవ్రంగా నిరసించారు.
గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినమని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి గంధమల్లకు నీళ్లు కేసీఆర్ నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి రావడం లేదా అని ఒకసారి రేవంత్ రెడ్డి, స్థానిక నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మండల సెక్రెటరీ జనరల్ రచ్చ రామ్ నరసయ్య, మాజీ సర్పంచ్ కోటగిరి పండరి, ఎసిరెడ్డి మహేందర్రెడ్డి, మాజీ ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, బింగి రవి, జింకల రామకృష్ణ, జూకంటి ఉప్పలయ్య, దయ్యాల సంపత్, కుతాటి అంజన్ కుమార్, సముద్రాల కుమార్, గంగాధరి సుధీర్ కుమార్, వడ్ల శోభన్ బాబు, జల్లి నరసింహులు, జింకల భరత్, కొండ చంద్రారెడ్డి, మొరిగాడి అశోక్, కంతి మహేందర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.