ఆలేరు టౌన్, సెప్టెంబర్ 01 : ఆలేరు పట్టణంలోని భరత్ నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఏఎంసీ డైరెక్టర్, ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలిసిన ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సోమవారం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య విషయాలను ఆరా తీసి, మనోధైర్యం కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటుందని అన్నారు. ఆమె వెంట ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి, పత్తి వెంకటేశ్, బేతి రాములు, సోషల్ మీడియా నాయకులు ఎండీ జమాల్, కటకం బాలరాజు, బాసాని ప్రశాంత్ పాల్గొన్నారు.