Gongidi Sunitha | కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి.. ప్రజా ఆస్తుల ధ్వంసంగా పరిగణించాలి..!
ఆలేరు టౌన్, ఏప్రిల్ 5 : గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అభివర్ణించారు.
ఆలేరు టౌన్, ఏప్రిల్ 5 : గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అభివర్ణించారు. గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ సైనికులతో కలిసి ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ధ్వంసం చేయడం అంటే ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడమే అని ఆమె కాంగ్రెస్ సర్కార్ పై ధ్వజమెత్తారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులోని బేగంపేటలో క్యాంప్ కార్యాలయానికి ప్రగతి భవన్‌గా నామకరణం చేశారని, రాష్ట్రానికి ఎవరు సీఎం అయినా భవన్లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి అందులో ఉండడానికి నామోషీగా భావించి, ఆ భవన్నా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కోసం ఏర్పాటు చేశారని గొంగిడి సునీత మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కూడా క్యాంప్ కార్యాలయానికి రాకుండా రేవంత్ రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు వందల కోట్లు వెచ్చించి.. తమ సొంత ఇళ్ల చుట్టూ పటిష్టమైన కంచె నిర్మించుకొని ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆమె కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు.
గజ్వేల్ క్యాంప్ ఎదుట నిరసన తెలుపుతూ వంద మంది కాంగ్రెస్ గుండాలు క్యాంప్ కార్యాలయంలోకి చొరబడి కేసీఆర్ ఫోటోను తొలగించి అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం సమంజసమైన అని కాంగ్రెస్ నాయకులను ఆమె ప్రశ్నించారు. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం నిర్వహించిన దాడి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా .. ముందు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాల్లో ఉంటున్నారా లేదా తెలుసుకోవాలని ఆమె నాయకులను హెచ్చరించారు. బీఆర్ఎస్ జోలికి వస్తే ఉక్కు పాదంతో అణచివేస్తామని ఆమె తేల్చి చెప్పారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను యాదాద్రి ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సీఐ శంకర్ గౌడ్, ఆలేరు ఎస్సై వినయ్ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, కౌన్సిలర్లు పాకాల మౌనిక, హరీష్, బీజన్న, కల్యాణి, మధు, యాట శివ, మాజీ ఏఎంసి చైర్మన్ గ్యాలపాక నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు ఆడేపు బాలస్వామి, పత్తి వెంకటేష్, గుండె సంపత్, పూల శ్రవణ్, మోర్తాల రమణారెడ్డి, అజయ్, ఎండీ ఫయాజ్, ఎండీ జమాల్, బాలరాజు, ప్రశాంత్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

