యాదగిరిగుట్ట, మే 22 : బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం యాదగిరిగుట్ట పట్టణ నాయకుడు సదా ప్రవీణ్‌కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రవీణ్‌కుమార్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అండగా నిలిచారు. గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున రూ.1.05 లక్షల నగదు, చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, నాయకులు ఆరె శ్రీదర్ గౌడ్, ముఖ్యర్ల శ్రీశైలం, సతీశ్ యాదవ్, ఆవుల సాయియాదవ్, పాండవుల భాస్కర్ గౌడ్, కోన్యాల నర్సింహారెడ్డి, పల్లె సంతోశ్‌గౌడ్, మిట్ట అనిల్ గౌడ్, యాకుబ్, సూదగాని శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.