రాజాపేట, జనవరి 19 : బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్కు ఇటీవల ప్రమాదవశాత్తు చేతులకు మంట అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం విషయం తెలుసుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తిరుమలేష్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, నాయకులు చామకూర గోపాల్ గౌడ్, సంధిల భాస్కర్ గౌడ్, చింతలపూరి వెంకటరామిరెడ్డి, గుంటి కృష్ణ, గుర్రం నర్సింహులు, చెరుకు కనకయ్య, మిట్ట కార్తీక్ గౌడ్, కిషన్, బాబు, ఉప్పలయ్య గౌడ్, రాజు, వరుణ్ రమేష్, కటకం వెంకటేశం ఉన్నారు.