రాజాపేట, జూలై 30 : ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని దూది వెంకటాపురంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోడిసెల శ్రీరాములు (45) రోజులాగే తాటిచెట్లు ఎక్కేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. శ్రీరాములుకు భార్య భాగ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.