బీబీనగర్, జనవరి 02 : బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామం నుండి మెట్టు వరకు వెళ్లే ప్రధాన రహదారిలో ఏర్పడిన భారీ గుంతలతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శుక్రవారం గుంతలను పూడ్చారు. రోడ్డు దుస్థితి వల్ల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తమ సొంత నిధులతోనే పనులు చేపట్టారు. యువత చొరవతో రహదారి సాఫీగా మారడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ ఫ్రెండ్స్ యూత్ సభ్యులను ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో యువత భాగస్వామ్యం కావడం సమాజానికి ఆదర్శమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఆరుముల్ల రమేశ్, బత్తుల హరిశంకర్, ఊటికొండ శ్రీనివాస్, గాండ్ల బాల్రాజ్, చిన్నగళ్ల అశోక్, పల్లెపాటి సుదర్శన్, వుల్సి ప్రసాద్, ఆరుముల్ల పాండు, సంకూరి రవిశంకర్, కడెం అశోక్ పాల్గొన్నారు.