రాజాపేట, ఏప్రిల్ 19 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కొండ్రెడ్డిచెరువు తాజా మాజీ సర్పంచ్ చెరుకు విజయాకనకయ్య శనివారం ఉపాధి హామీ పథకంలో కూలీగా పనుల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొండ్రెడ్డిచెరువును నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయగా గ్రామస్తులు విజయను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.
గ్రామాభివృద్ధి కోసం వెచ్చించిన రూ. 18 లక్షలు బకాయి ఉన్నట్టు విజయ తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టడానికి అప్పులు చేసి మరి ఖర్చు చేశామని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కుటుంబ నిర్వహణ కోసం తాను తప్పనిసరై ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సిన వస్తుందని తెలిపారు.