ఆత్మకూర్ (ఎం), జూలై 21 : విశ్వసనీయ సమాచారంతో ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా పేకాడ ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్సై సైదులు తెలిపారు. సామ కృష్ణారెడ్డి, ఎరుకల పాపయ్య, బోడ శ్రీనివాస్, జెట్ట ధనుంజయ్య, బూతరాజు సతీశ్‌ను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 8,440 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, 3 సెట్ల కార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.