భూదాన్ పోచంపల్లి, జూలై 3 : యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణగిరిలోని జబ్ వాణి ఆగ్రో టెక్ ప్లైవుడ్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జబ్ వాణి అగ్రోటెక్ ప్లైవుడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు షార్ట్ సర్క్యూట్తో సంభవించింది. దీంతో ప్లైవుడ్, మిషన్లకు మంటలు అంటుకున్నాయి.
గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.