Yadadri : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఉన్న ఎస్ఆర్ రసాయన పరిశ్రమ(SR Chemical Factory)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
శనివారం రాత్రి పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆస్తి నష్టం ఏమేరకు జరిగింది?అనే వివరాలు తెలియాల్సి ఉంది.