బీబీనగర్, జనవరి 12 : బీబీనగర్ పట్టణ కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో నివాసం ఉంటున్న పొట్ట నర్సింహ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుడిగా సేవలు అందిస్తున్నాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. నర్సింహ మృతి పట్ల కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో పిఎన్కె టీమ్ తరపున రూ.25 వేలు, కాలనీ వాసులు మరో రూ.15,600 సమకూర్చి మొత్తం రూ.40,600ను పిఎన్కె టీమ్ ప్రతినిధి పొట్ట నవీన్ కుమార్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పొట్ట వెంకటేశ్వర్లు, పొట్ట మహేశ్, మంచాల లింగస్వామి, పొట్ట భాస్కర్, గోసుకొండ మహేశ్, శ్రీనివాస్, అశోక్, రాజు, వెంకట్, కృష్ణ, ప్రేమ్, టిల్లు, లింగం, వినయ్, శివ, నాని, శ్రీకాంత్, చిన్ను, బాలయ్య పాల్గొన్నారు.