రామన్నపేట, నవంబర్ 04 : రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన చలమల్ల శ్రీనివాస్ ఇటీవల అకస్మాత్తుగా మరణించాడు. నిరుపేద కుటుంబం కావడంతో దాతల స్పందనతో రూ.94,317 జమ చేశారు. ఈ నగదును గ్రామ పెద్దలందరూ కలిసి మంగళవారం శ్రీనివాస్ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొంగరి బాలరాజు, గ్రామ మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మాజీ ఎంపీటీసీ బడుగు రమేశ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు జెల్ల శ్రీనివాస్, నాయకులు గోశిక చక్రపాణి, సాయిని శేఖర్, పున్న భద్రాచలం, పున్న కనకరత్నం, చిలువేరు వెంకటయ్య, మూడుదుడ్ల రాజు, దొంత యాదగిరి, పున్న యాదగిరి, గంజి రామకృష్ణ, పున్న శివ కుమార్, సింగం ఉపేందర్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.