బీబీనగర్, ఫిబ్రవరి 9 : బీబీనగర్ మండలంలోని రావిపహడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మైలారం శంకరయ్య ఇటీవల మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుటుంబం ఆర్దిక పరిస్థితి బాగాలేదు. దీంతో బీబీనగర్ మండల మాజీ ఎంపీపీ యర్కకల సుధాకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు బొక్క జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్ సహకారంతో రూ.20 వేల ఆర్థిక సాయాన్ని స్థానిక నాయకులు సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెడబోయిన వెంకటేష్, ఉప సర్పంచ్ ఇంద్రాల భిక్షపతి, మాజీ వైస్ ఎంపీపీ కొంతం లింగయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుర్ల రమేశ్, ఉపాధ్యక్షుడు కొంతం భాస్కర్ గౌడ్, వార్డు సభ్యులు కూకుట్ల భవిత, బాలరాజ్, ఆవుర్ల పాండు, ఏంజాల బాలకృష్ణ, కొత్త అనంత రెడ్డి, ఆవుర్ల నరసింహ, బొల్లేపల్లి నరసింహ, బొల్లేపల్లి జాంగిర్ పాల్గొన్నారు.