రాజాపేట, సెప్టెంబర్ 18 : రాజాపేటకు చెందిన గడం లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందింది. గురువారం మృతురాలి కుటుంబానికి జై శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో చెలమనపల్లి లక్ష్మణ్, బిర్రు సురేశ్, చిగుళ్ల బీరయ్య, సాధనబోయిన శంకర్, గోళ్లేన సురేశ్, కోయ మధు, అభయ్, గడం కృష్ణా, డప్పు ముని, కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.