రాజాపేట, అక్టోబర్ 25 : రాజాపేట మండలం కేంద్రంలోని ఠాకూర్ స్వరన్ పాల్సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సందర్శించారు. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ దివాకర్ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులు సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగు విధానాన్ని రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి శ్రీనివాస్, నంగునూరి రాజు, బాబు పాల్గొన్నారు.