వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంపై యాదాద్రి జిల్లా రైతన్నలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మల్లాపురం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వడ్ల బస్తాలను తగులబెట్టి నిరసన తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లనున పట్టించుకునే నాథుడే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దిగొచ్చి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.