Farmers | రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ పాలనలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పే దృశ్యాలు రైతుల ఆందోళనల రూపంలో బయటకు వస్తున్నాయని తెలిసిందే. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు సరైన నాణ్యమైన కరెంట్ లేక, మరోవైపు కరెంట్ ఎప్పుడొస్తది.. వచ్చినా ఎప్పుడు పోతదో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు.
24 గంటలు కాదు కనీసం 5-6 గంటలు కరెంట్ సరిగా ఉండకపోవడంతో రైతన్నలు కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని తరలిస్తూ వరి చేన్లను తడుపుతుంటే.. మరోవైపు జనరేటర్ల సాయంతో పొలాలను నీరు పారించుకుంటున్నారు. కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. రైతులంతా కలిసి బతుకమ్మ ఆడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం చిమిర్యాల గ్రామంలో కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు సబ్ స్టేషన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా కోతలు లేని కరెంటు ఇవ్వాలని సబ్ స్టేషన్ ముందు వినూత్నంగా బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కరెంట్ కోతలను నిరసిస్తూ బతుకమ్మ ఆడిన రైతులు
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం చిమిర్యాల గ్రామంలో కరెంటు కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ను ముట్టడించిన రైతులు
కోతలు లేని కరెంటు ఇవ్వాలని సబ్ స్టేషన్ ముందు వినూత్నంగా బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ నిరసన https://t.co/q0cRvgTR1I
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2026
కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సుంకె రవిశంకర్
Kushitha Kallapu | నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న కుషిత.. రెడ్ శారీలో అదిరిపోయే లుక్!
Dhurandhar The Revenge | థియేటర్లలో దుమ్మురేపిన ‘ధురంధర్’.. టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అంటే..!