ఎయిమ్స్ బీబీనగర్ పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు
ఎయిమ్స్ బీబీనగర్ పేరిట ఎయిమ్స్ బీబీనగర్ జాబ్ ఆపర్చునిటీస్–2026” పేరుతో వివిధ వేదికలలో ప్రచారం జరుగుతున్న ఉద్యోగ ప్రకటనలు పూర్తిగా నకిలీవని ఎయిమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగా ఎంపిక చేస్తామని పేర్కొంటూ..
– ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
బీబీనగర్, ఏప్రిల్ 04 : ఎయిమ్స్ బీబీనగర్ పేరిట ఎయిమ్స్ బీబీనగర్ జాబ్ ఆపర్చునిటీస్–2026” పేరుతో వివిధ వేదికలలో ప్రచారం జరుగుతున్న ఉద్యోగ ప్రకటనలు పూర్తిగా నకిలీవని ఎయిమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగా ఎంపిక చేస్తామని పేర్కొంటూ ప్రచారం చేస్తున్న ఈ ప్రకటనలతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ తరఫున ఇలాంటి నియామక ప్రకటనలు ఎప్పుడూ విడుదల చేయలేదని, నియామకాలు ఎల్లప్పుడూ సరైన ఎంపిక విధానం ద్వారా మాత్రమే నిర్వహించబడతాయని వెల్లడించారు. సంస్థకు సంబంధించిన అన్ని అధికారిక ఉద్యోగ ప్రకటనలు కేవలం అధికారిక వెబ్సైట్, పత్రికల ద్వారానే విడుదల అవుతాయని పేర్కొన్నారు. నకిలీ ప్రకటనలకు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. వ్యక్తిగత వివరాలు పంచుకోవడం లేదా ఎలాంటి చెల్లింపులు చేయడం నివారించాలని హెచ్చరించారు. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా అధికారిక వనరుల ద్వారానే నిర్ధారించుకోవాలని కోరారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

