బీబీనగర్, జూన్ 05 : ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, రాక్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చైర్మన్ ఎం.రామానాయుడుకు ఎక్స్లెన్స్ అవార్డు 2025 అవార్డు లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండో-యూకే గ్రీన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఈసీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందుకున్నట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విద్యారంగం, పర్యావరణ సంరక్షణ, ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణల విషయంలో చేసిన కృషికి ఈ గౌరవం లభించినట్లు వెల్లడించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన వన ప్రతిష్ట కార్యక్రమంలో అవార్డు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, ఈసీజీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.