– సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి
మోత్కూరు, మార్చి 26 : మాజీ ఎంపీ, దివంగత నేత బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ధర్మ భిక్షం 15వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని ప్రధాన రహదారిలో ప్రతిష్టించిన విగ్రహాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల హక్కుల కోసం విరోచితంగా పోరాటం చేసిన ఉద్యమ దివిటి ధర్మ భిక్షం అని కొనియాడారు.
నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో పోరాడి హక్కుల సాధనకు చేసిన పోరాట పటిమను గుర్తుచేసి కొనియాడారు. ఆయన సేవలు ప్రజల జీవితాల్లో చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి వై.దామోదర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు ప్రభాకర్, మండల కార్యదర్శి అన్నప్ప వెంకట్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ విమల, నాయకులు అంజయ్య, యాదగిరి, చంద్రయ్య పాల్గొన్నారు.