మోత్కూరు, మార్చి 31 : కుల, మత, జాతి, లింగ బేధాలు లేకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరు కలిసి ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి తిరుమలేశ్ అన్నారు. మోత్కూర్ మండలంలోని ముషిపట్ల గ్రామంలో ఆర్ఐ కాసోజు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన డబ్బులు ఆలస్యం కాకుండా వెంటనే వారికి చెక్కులు అందజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాలు ప్రభుత్వం వెంటనే అందజేయాలని కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అమలు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంపై అందరూ అవగాహన పెంచుకుని ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్క అధికారి ఎస్సీ, ఎస్టీలు తమ న్యాయమైన పనులపై తమ దగ్గరకు వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కేసుల్లో రాజీలు కుదుర్చుకోవద్దు అని, న్యాయపరంగానే పోరాడాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలు కూడా తప్పుడు కేసులు నమోదు చేయొద్దన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పైళ్ల నర్సిరెడ్డి, ఎస్ఐ సతీశ్, ఏపీఓ జనార్దన్ రెడ్డి, ఏఆర్ఐ రవీంద్ర చారి, ఏపీఎం పకీరయ్య, పంచాయతీ సెంక్రెటరీ యాదగిరి, జీపీఓ ప్రవీణ్, సీసీ భాస్కర్, హెచ్డబ్ల్యూఓ అశోక్, హెచ్.ఏ.(ఎఫ్) మంజుల, ఏడబ్ల్యూటీ భార్గవి, ఏఎస్ఐ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నోముల అంజయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మచ్చగిరి, వీబీకే దేవేంద్ర, వార్డ్ సభ్యులు కొల్లు సునీత, ఎలిమినేటి నవీన్ రెడ్డి, బుశిపాక శ్రీకాంత్, చెనగోని పావని, బుశిపాక పద్మ, నేర్లకంటి మచ్చగిరి, బుశిపాక రమేశ్, బుశిపాక నరేశ్, యాదగిరి, అంజి, అశోక్, నరేశ్, మహిళలు పాల్గొన్నారు.