ఎస్సీ గురుకుల సొసైటీలో నిధులు వృథా!
ఎస్సీ గురుకుల సొసైటీలో ఆంధ్రా అ ధికారుల పెత్తనం కొనసాగుతున్నదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నా రు.
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని సర్కార్
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో ఆంధ్రా అ ధికారుల పెత్తనం కొనసాగుతున్నదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నా రు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం నేరుగా ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నా ఆ ఫిర్యాదులపై అమాత్యుడు, ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఎస్సీ గురుకుల సొసైటీకి సంబంధించి అన్ని విభాగాల్లో దాదాపు 10 మందికిపైగా ఆంధ్రాకు చెందిన అధికారులు ఉన్నారని, సొసైటీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏండ్ల తరబడి ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు.
సొసైటీలో ప్రమోషన్ల ప్రక్రియ ముందుకు సాగకుండా సుదీర్ఘకాలంగా అడ్డుకుంటున్నారని, ఇష్టారీతిన నచ్చినవారికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సొసైటీ ఉన్నతాధికారులు జారీ చేసిన ప్రతి ఆర్డర్పై పూర్తి విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయని డిమాం డ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రత్యక్ష పో రాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఉ ద్యోగులు చేస్తున్న ఆరోపణలపై విజిలెన్స్, హెచ్ఆర్సీ సంస్థలకు ఫిర్యాదులందినా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పెద్దలే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు సొసైటీవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

