బీబీనగర్, ఏప్రిల్ 08 : బీబీనగర్ మండలంలోని రావిపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆదేశాల మేరకు గ్రామ బీఆర్ఎస్ కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ గ్రామ నాయకులు ఇంద్రియాల భిక్షపతి, అవుర్ల రమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎరసాని సాయికుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా తోటకూరి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా ఎరసాని భాను యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన విభాగం అధ్యక్షుడిగా అవుర్ల బాలకృష్ణ యాదవ్, ఉపాధ్యక్షుడిగా ఎరసాని మహేశ్, ప్రధాన కార్యదర్శిగా ఇంద్రియాల భాను ప్రసాద్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అవుర్ల పాండు, ఇంద్రియాల శంకరయ్య, బొల్లెపల్లి నరసింహ, కోసని నవీన్, మైలారం శ్రీకాంత్, అవుర్ల నవీన్ పాల్గొన్నారు.