కుక్కల పెంపునకు వసతి వివరాలివ్వండి
కుక్కల సంరక్షణకు అనువైన వసతిని ఏర్పాటు చేసుకుని, ఆ వివరాలను తనిఖీ కోసం జీహెచ్ఎంసీకి సమర్పించాలని పారిశ్రామికవేత్త కామేశ్వరి పిడపర్తిని హైకోర్టు ఆదేశించింది.
- పారిశ్రామికవేత్తకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ , ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : కుక్కల సంరక్షణకు అనువైన వసతిని ఏర్పాటు చేసుకుని, ఆ వివరాలను తనిఖీ కోసం జీహెచ్ఎంసీకి సమర్పించాలని పారిశ్రామికవేత్త కామేశ్వరి పిడపర్తిని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు మంజూరు చేసింది. నిర్ణీత గడువులోగా కుకలను ఉంచేందుకు అనువైన వసతి వివరాలను సమర్పించకపోతే.. ఏడు నెలల్లోపు వయస్సున్న చిన్న కుకపిల్లలను దత్తతకు ఇచ్చే అంశం పై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.ప్రజల ఫిర్యాదు మేరకు కామేశ్వరి వద్ద ఉన్న 37 కుకలు, కుకపిల్లలను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుంది. దీనిపై కామేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారించి.. కుకలను తరలించాలని, అలా చేయని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ, కుకల సంరక్షణ బాధ్యతను తమ కు అప్పగించాలని కోరుతూ ‘పీపుల్ ఫర్యానిమల్స్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ’ సంస్థ అప్పీలు దాఖలు చేసింది.దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. అన్ని కుకలకు స్టెరిలైజేషన్ పూర్తయిందని, కుకపిల్లలకు చికిత్స కూడా అందించినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
కుక్కల సంరక్షణకు అనువైన వసతిని ఏర్పాటు చేసుకుని, ఆ వివరాలను తనిఖీ కోసం జీహెచ్ఎంసీకి సమర్పించాలని పారిశ్రామికవేత్త కామేశ్వరి పిడపర్తిని హైకోర్టు ఆదేశించింది. లను దత్తత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కామేశ్వరి తరఫున ఆమె తల్లి కోర్టుకు హాజ రై.. కుకలను తమ వద్దే ఉంచుకునేందుకు అనువై న వసతిని ఏర్పాటు చేసుకోవడానికి గడువు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కుకలను ఉంచేందుకు తగిన వసతిని ఏర్పాటు చేసుకుని, ఆ వివరాలను జీహెచ్ఎంసీ పరిశీలనకు సమర్పించేందుకు కామేశ్వరికి మూడు వారాల గడువు ఇచ్చింది. మిగిలిన కుకల సంరక్షణ విషయంలో నూ ఆమె వద్ద అందుబాటులో ఉన్న వసతిని పరిశీలించిన తర్వాత దత్తతకు ఇవ్వాలా లేదా అనే అం శంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

