మోటకొండూర్, అక్టోబర్ 09 : యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు, అభ్యర్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఫర్నిచర్, భద్రతా చర్యలను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సాగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
నామినేషన్లు స్వీకరించే సమయంలో ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. నామినేషన్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిరా, మండల ప్రత్యేక అధికారి, జడ్పీటీసీ ఆర్ఓ నర్సింహరావు, ఏఓ రమాదేవి, ఎంపీడీఓ సూపరింటెండెంట్ యశోద, ఎంపీఓ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు నందాల సాయికుమార్, బొట్ల శ్రీకాంత్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.