బీబీనగర్, జనవరి 20 : బీబీనగర్ మండల పాలన అధికారుల (జిపిఓ) కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్ ఆద్వర్యంలో స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా గజం సత్తయ్య, ప్రధాన కార్యదర్శి- చక్రపాణి, అసోసియేట్ అధ్యక్షుడు- డి.నర్సింలు, ఉపాధ్యక్షురాలు- మౌనిక, కోశాధికారి- ఎన్.శ్రీలత, ఈసీ సభ్యులు- రాజమని, సుమిత్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన జిపిఓల సంఘం మండల అధ్యక్షుడు గజం సత్తయ్య మాట్లాడుతూ.. గ్రామ పాలన అధికారుల సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని, అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి గ్రామ పాలన అధికారుల హక్కుల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ధన్ వంతు, జిల్లా కోశాధికారి బానోతు సురేశ్, అసోసియేట్ అధ్యక్షుడు పసుల రమేశ్, ఈసీ సభ్యురాలు సుజాత, టీజీఆర్ఎస్ఏ మహిళా అధ్యక్షురాలు కె.బాలమణి పాల్గొన్నారు. మండలంలోని గ్రామ పాలన అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.