భూదాన్ పోచంపల్లి, మే 31 : పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భూదాన్ పోచంపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకు వాడడంతో రోగాల బారిన పడుతున్నారని, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలన్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోతారెడ్డి , సూపర్వైజర్లు అరుంధతి, శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మణ్ బాబు, బేగ్, భవాని, నాగమణి, లత, ఆరోగ్య కేంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : పొగాకు రహిత సమాజ నిర్మాణానికి కృషి : డాక్టర్ శ్రీవాణి