రాజాపేట, నవంబర్ 17 : ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. సోమవారం రాజాపేట మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాజాపేటలో బీసీ, కురుమ కమిటీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు రాజాపేట శివాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పారుపల్లి, కుర్రారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు, గొర్రె పొట్టేలను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్ గౌడ్, బుడిగే పెంటయ్య గౌడ్, మోత్కుపల్లి ప్రవీణ్, విట్టల్ నాయక్, కాలే సుమలత, ఇంజ నరేశ్, ఐరేని నవీన్ కుమార్, నేమిల కేదారి, రేగు సిద్ధులు, గాడి పల్లి శ్రవణ్ కుమార్, యాదేశ్, రామ్జీ నాయక్ పాల్గొన్నారు.