రాజాపేట, మార్చి 20 : రాజాపేట మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇంజ మహేశ్‌ను విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ భువనగిరి డివిజన్ చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు టీజీ ఎస్పీడీసీఎల్ కంపెనీ కో చైర్మన్ బొక్క పాండర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా కో చైర్మన్ భాస్కర్ నాయక్ శుక్రవారం తెలిపారు. కన్వీనర్‌గా బొట్ల రమేశ్, కో చైర్మన్ ఎడ్ల వెంకటేశ్, వైస్ చైర్మన్‌గా సాహిని రమేశ్ ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర చైర్మన్‌కు ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.