రాజాపేట, మార్చి 25 : బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు ఎంబీ రికార్డు ప్రకారం డబ్బులు చెల్లించలేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాధపురం గ్రామ మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్ ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో జిల్లా పంచాయతీ అధికారి సునంద మంగళవారం రఘునాథపురంను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులను, ఉపాధి హామీ పనుల్లో చెల్లించిన రికార్డులను పరిశీలించారు. నివేదికను కలెక్టర్కు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగవేణి, ఎంపీఓ కిషన్ పాల్గొన్నారు.