రామన్నపేట, అక్టోబర్ 23 : రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు 170 మందికి, అలాగే మండల పరిషత్ పాథమిక పాఠశాల విద్యార్థులు 160 మందికి దివిస్ లేబరేటరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.2 లక్షల విలువ గల నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేసింది. గురువారం దివిస్ లేబరేటరీ సిఎస్ఆర్ ఇన్చార్జి గోపి, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బ్యాగ్స్, బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ వెల్లంకి హెచ్ఎం టి.సురేందర్ రెడ్డి, ఎంపీపీఎస్ హెచ్ఎం పి.మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.