బీబీనగర్, జనవరి 26 : 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ పట్టణ కేంద్రంలో గర్భిణులకు న్యూట్రిషన్, డ్రై ఫ్రూట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్యం కుటుంబం, సమాజ భవిష్యత్‌కు కీలకమన్నారు. వారికి అవసరమైన పోషకాహారం అందించడం సామాజిక బాధ్యత అని తెలిపారు. పోషకాహారం తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చెంగల్ వెంకట్ కిషన్‌రావు, పిట్టల అశోక్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ పంజాల సురేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్, వార్డు సభ్యులు దేవరుప్పల పృథ్వీరాజ్, మాజీ వార్డు సభ్యులు పంజాల పెంటయ్యగౌడ్, బెండ ప్రవీణ్, సామల వేణు, గోరుకంటి నరేష్, గోరుకంటి మహేష్, గోరుకంటి శివకుమార్‌తో పాటు గుంటిపల్లి లక్ష్మీనారాయణ, దేవరకొండ శ్రీనివాస్, మురళి ముదిరాజ్, రామ్ ముదిరాజ్, ఉడుత మహేష్, పంజాల మహేష్ గౌడ్, మర్రి వెంకటేష్, పంజాల ఈశ్వర్ గౌడ్, మర్రి శ్రీకాంత్, వేముల శ్రీకాంత్, పొట్ట శ్రీనివాస్, తూర్పాటి నరసింహ, రాంపల్లి జంగయ్య, రాంపల్లి కుమార్, పెరబోయిన నరేష్ యాదవ్, టంటం రాజు, టంటం గణేష్ పాల్గొన్నారు.