ఆలేరు టౌన్/బొమ్మలరామారం/ఆలేరు రూరల్, డిసెంబర్ 6 : ఆలేరు మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన లింగాల భూలక్ష్మికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును సోమవారం మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అందజేశారు. కార్యక్రమంలో పుట్ట మల్లేశం, బేతి రాములు, జూకంటి శ్రీకాంత్, ఎర్ర దేవదానం, బింగి రవి, ఫయాజ్, జయ, సీస రాజేశ్, కుతాటి అంజన్, వెంకటేశ్ పాల్గొన్నారు. బొమ్మలరామారం మండలంలోని జలాల్‌పూర్‌కు చెందిన జాగిళ్లపురం నర్సయ్యకు రూ.25వేలు, బండి భవానికి రూ.32,500 మంజూరు కాగా, ఆ చెక్కులను ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మేడబోయిన గణేశ్, ఎంపీటీసీ నర్సింహ, నాయకులు గొడుగు చంద్రమౌళి, నాగరాజు, మహేందర్‌రెడ్డి, భరత్, వీరయ్య, నవీన్, మురళి, శ్రీకాంత్, భాను, సత్యనారాయణ పాల్గొన్నారు. ఆలేరు మండలంలోని శ్రీనివాసపురానికి చెందిన చౌడబోయిన మహేందర్‌కు మంజూరైన రూ.55వేల చెక్కును టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వడ్ల శోభన్‌బాబు అందజేశారు. కార్యక్రమలో గడ్డం ఇస్తారి, చౌడబోయిన జనార్దన్, మహేశ్, దండు ఐలయ్య, శ్రీకాంత్, వడ్ల నర్సయ్య పాల్గొన్నారు.