నల్లగొండ, ఫిబ్రవరి 14 : నల్లగొండ జిల్లా పేరూరు గ్రామానికి చెందిన పసుల స్వప్న వృక్షశాస్త్రం విభాగంలో డాక్టరేట్ పట్టా పొందారు. రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ జగదీష్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ నుంచి ఆమె డాక్టరేట్ పొందారు. డాక్టర్ దినేష్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ స్పెషల్ స్పీసిస్ అవైలబుల్ ఇన్ నేచర్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ డిక్రీజింగ్ ఎయిర్ పొల్యూటెన్స్ ఇన్ తెలంగాణ స్టేట్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆమెకు డాక్టరేట్ లభించింది. డాక్టరేట్ రావడం పట్ల స్వప్న సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన కుటుంబ సభ్యులు, తోటి అధ్యాపకుల ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలియజేశారు.