రాజాపేట, సెప్టెంబర్ 20 : రాజాపేట మండలంలోని నేమిలే గ్రామానికి త్రాగునీరు కోసం 1992లో వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఇప్పుడు ఆ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉంది. పిల్లర్లు పగుళ్లు పట్టి, ట్యాంక్ స్లాబ్ పెచ్చులూడి పడుతూ ఇనుప చువ్వలు తేలి దర్శనమిస్తుంది. గాలి దుమారంకు ఉగిసలాడుతూ, వర్షానికి పెచ్చులూడి పడుతున్నాయి. ట్యాంక్ ఒక పక్కన అంగన్వాడీ కేంద్రం కొనసాగుతుండగా మరో పక్కన నివాస గృహాలు ఉన్నాయి. దాంతో ట్యాంక్ ఎప్పుడు కులుతుందోనని భయాందోళనతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ప్రమాదం జరగకముందే నిరుపయోగంగా శిధిలావస్థకు చేరుకున్న ట్యాంక్‌ను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.