రాజాపేట, నవంబర్ 20 : తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత, బీఆర్ఎస్ రాజాపేట మండల ఫౌండర్ బూరుగు ధర్మారెడ్డి మరణం తీరని లోటు అని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ధర్మారెడ్డి మరణం పట్ల గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి అకాల మృతితో పార్టీకి తీవ్ర నష్టం చేకూరిందన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపునందుకుని గులాబీ జెండా పట్టుకుని ఊరూరా తిరిగి పార్టీ బలోపేతం కోసం ధర్మారెడ్డి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఊరురా ఆయన ప్రసంగాలతో ప్రజలను, యువతను చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. రాష్ట్ర సాధనకు ప్రతి ఒక్కరిని మేల్కొల్పిన ఉద్యమ నేత మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం మండలంలో ఆయన చేసిన పోరాట స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ధర్మారెడ్డి చేసిన కృషి వెలకట్టలేదన్నారు. ధర్మారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, మాజీ జడ్పిటీసీ చామకూర గోపాల్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మదర్ డైరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్ రాంరెడ్డి, నాయకులు కోరుకొప్పుల వెంకటేశ్ గౌడ్, బొంగోని ఉప్పలయ్య గౌడ్, గుంటి కృష్ణ, నాగిర్తి గోపిరెడ్డి, ఎర్రగోకుల జస్వంత్, వీరేశం, యమ్మ భాస్కర్ ఉద్యమ నేత ధర్మారెడ్డి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.