బీబీనగర్, ఫిబ్రవరి 09 : బీబీనగర్ మండలంలోని పడమటి సోమవారం గ్రామంలోని శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుండి 13 వరకు ఘనంగా జరుగనున్నాయని, బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని సర్పంచ్ బద్దం అంజయ్య కోరారు. ఈ మేరకు ఆదివారం గ్రామ పంచాయతి పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి శ్రీ లింగబసవేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తంతరపల్లి ప్రదీప్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు ఆల్వ లింగారెడ్డి, ఆల్వ పుష్పమ్మ బాల్ రెడ్డి, దేశం శ్రీనివాస్ గౌడ్, దాసరి నాగలక్ష్మి కృష్ణ, నూనె అమృత రాములు, ఎండి రేష్మ ఉస్మాన్, దేవాలయ మాజీ చైర్మన్ వాకిటి బస్వారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆల్వ రవీందర్ రెడ్డి, జమ్మిగారి సత్యనారాయణ, బొమ్మగోని విజయ్ గౌడ్, గోరకంటి వేణు, నూనె భరద్వాజ్ పాల్గొన్నారు.