యాదగిరిగుట్ట, మర్చి7: వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబాలను డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పరామర్శించారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలంలోని జంగంపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గుంటి శ్రీశైలం తల్లి రాములమ్మ, పట్టణానికి చెందిన అన్నపూర్ణ హోటల్ అధినేత తాడేం యాదగిరి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో గొంగిడి మహేందర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రి వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీద రవీందర్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆవుల మమతా సాయి, మాజీ సర్పంచ్ గుండ్ల మల్లారెడ్డి, సున్నం లక్ష్మయ్య, మాటూరి బాలయ్య, జానపరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
పశుగ్రాసానికి ట్యాంకర్‌తో నీళ్లు
రాజాపేట, మార్చి 7: రాజాపేట మండల కేంద్రానికి చెందిన రేగు కనకయ్య తనకు ఉన్న మూడు బోర్లతో మూడు ఎకరాల వరి సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఉన్న మూడు బోర్లు పట్టిపోయి సాగు చేసిన మూడు ఎకరాల వరి పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు మేతకు వదిలేశాడు. తనకున్న ఆరు పశువుల కోసం వేసిన పశుగ్రాసం సైతం ఎండిపోతుండడంతో ట్యాంకర్ ద్వారా నీళ్లు పోసి కాపాడుకుంటున్నాడు.