ఆత్మకూరు(ఎం), జూలై 18 : ఉపాద్యాయులందరికి డీఏలు, పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కొణతం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. అదే విధంగా ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్ సిలిండర్లను అందివ్వాలన్నారు. గత సంవత్సరం విద్యార్థులకు అందజేసిన అల్పాహరం కోసం ఖర్చుచేసిన బిల్లులు విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కట్ట రమేశ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆరూర్ ఎల్లయ్య, దొడ్డి రవి, వెంకన్న, శ్రీను, సోమయ్య పాల్గొన్నారు.