రాజాపేట, నవంబర్ 22 : పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని కోరుతూ రాజాపేట మండలంలోని సింగారం గ్రామ పాడి రైతులు శనివారం రాజాపేట మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్ర గేట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు నెలల పాల బిల్లు పెండింగ్ లో ఉందని, బిల్లుల చెల్లింపులో మదర్ డైయిరీ జాప్యం చేస్తుందన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించని మదర్ డైయిరీ చైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పట్టించుకుని వెంటనే బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరారు.