సంస్థాన్ నారాయణపురం, జూన్ 17 : సీపీఐ పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల 15వ మహాసభలను ఈ నెల 27వ తేదీన మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు, మహాసభకు ప్రతి కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగోని గాలయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, నాయకులు కలకొండ సంజీవ, చిలువేరు అంజయ్య, పొట్ట శంకరయ్య, వీరమల్ల అంజయ్య, కొండూరు వెంకటేశ్, యాదయ్య, సుర్వి నరసింహా, మంచాల జంగయ్య, పల్లె మల్లారెడ్డి, ముత్యాల అంజయ్య, తోకల రామ్‌రెడ్డి, పందుల యాదగిరి, భీమనపల్లి గాలయ్య పాల్గొన్నారు.