చౌటుప్పల్, జూలై 12 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీల బాధ్యులు హైదరాబాద్‌లోని నివాసంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని కలిశారు. నూతన బాధ్యులను మాజీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్ఎస్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాటలు తప్పా పనులు చేయడం లేదని విమర్శించారు.
కార్యకర్తలు సైతం పార్టీ బలోపేతానికి మరింత పనిచేయాలన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. దీంతో ఎలాంటి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, గ్రామ నూతన కన్వీనర్ ముదిగొండ వెంకటేశ్, కో కన్వీనర్లు జొన్నగంటి గోపాల్, సిలువేరు వెంకటేశ్, బుర్రా జంగారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ గుర్రం శివకుమార్, నాయకులు మల్కాజిగిరి శ్రీశైలం, రాచర్ల వెంకటేశ్, శివగౌడ్, బొంతల ఓం ప్రకాశ్, ఈడ్డుల వెంకటేశ్ పాల్గొన్నారు.