సంస్థాన్ నారాయణపురం, జూన్ 05 : అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, డీఎల్ఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ దాసరి లవలేశ్ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించకుండా వ్యవసాయ భూములు, సొంత ఇల్లు ఉన్న వారికి కేటాయించినట్లు తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి నచ్చిన వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారన్నారు.