– అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ
బీబీనగర్, జనవరి 31 : రోడ్డు భద్రత పట్ల సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అడిషనల్ ఎస్పీ సిహెచ్.లక్ష్మీనారాయణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పరిధిలోని గూడూరు వద్ద ఉన్న హైదరాబాద్–యాదగిరి టోల్ ప్లాజా ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రయాణ సమయంలో వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల రోజులుగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమ నిబంధనల పాటింపు విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.

Bibinagar : ‘రోడ్డు భద్రతపై సమాజాన్ని జాగృతం చేయాలి’
యాదాద్రి జిల్లా పోలీస్ శాఖ ప్రజల రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ప్రమాదాలను తగ్గించి ప్రతి పౌరుడి ప్రాణాన్ని కాపాడే దిశగా మరింత సమగ్రమైన అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డి, ఆర్టీy సాయి కృష్ణ, టోల్ ప్లాజా జనరల్ మేనేజర్ చంద్రమోహన్, మేనేజర్ నాగేశ్వరరావు, సిఐలు మధుసూదన్, ఇమ్రాన్, ఎస్సైలు అమర్ సింగ్, లక్ష్మణ్, ఆనంద్, శ్యాం ప్రసాద్, ప్రణీత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, వెంకన్న, మధుసూదన్, పోలీస్ సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Bibinagar : ‘రోడ్డు భద్రతపై సమాజాన్ని జాగృతం చేయాలి’