– లైన్మెన్ బాల్నర్సింహకు కలెక్టర్ హనుమంతరావు ప్రశంస
బీబీనగర్, జనవరి 26 : ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ విధుల్లో అంకితభావం చూపిన లైన్మెన్కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ పట్టణ కేంద్రంలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యుత్ ఉద్యోగి ర్యాకల బాల్నర్సింహను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేకంగా ప్రశంసించారు. కలెక్టర్ చేతుల మీదుగా బాల్నర్సింహ సోమవారం ప్రశంసా పత్రం అందుకున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా ప్రజలకు విద్యుత్ సేవలు నిరవధికంగా అందించడంలో నిరంతరం కృషి చేయాలన్నారు.