మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న దళితబంధు ప్రారంభోత్సావాన్ని పురస్కరించు కొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభీషేకం నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండల కమిటీ, ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. దళితుల సంక్షేమం కోసం సీ ఎం కేసీఆర్ పథకాన్ని గొప్పగా అమలు చేశారన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నేబోయిన రమేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేందర్నాథ్, మాజీ వైస్ చైర్మన్ కొణతం యాకుబ్‌రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బుషిపాక లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, రైతుబంధు మండలాధ్యక్షుడు కొండ సోంమల్లు, మండల ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశ్, మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, ఎస్సీ సెల్ నాయకులు రఘుపతి, మర్రి అనిల్, దాసరి తిరుమలేశ్, మెంట నగేశ్ పాల్గొన్నారు.
అడ్డగూడూరులో
అడ్డగూడూరు: హూజురాబాద్‌లో సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభిస్తుండడంతో మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండ ల పార్టీ అధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభీషేకం చేశారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్ మాట్లాడు తూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితులకు దళితబంధు పథకంతో కుటుంబా నికి రూ.10 లక్షలు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందజేయడం అభినందనీయమన్నారు.
దేశంలో గతంలో 70 సంవత్సరాలు పరిపాలన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దళితుల సంక్షేమం గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. దళితులు అడుగక ముందే సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి దశాలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10లక్షలు ఇవ్వాలని దళితులంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ మెంబర్ గుండిగ జోసఫ్, సర్పంచ్‌లు ఇటికాల కుమార్‌స్వామి, మద్ది సత్తయ్య, నాయకులు పాశం విష్ణువర్థన్, మందుల కిరణ్, బైరు లింగయ్య, చిత్తలూరి నరేశ్, దావిద్, జనార్థన్‌రెడ్డి , గూడెపు పరమేశ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.