– కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ
– లాఠీచార్జి చేసి చెదరగొట్టిన పోలీసులు
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 01 : భువనగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. అనంతరం భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయంపై దాడి చేశారు. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.