గట్టుప్పల్, జూన్ 13 : 30 నెలలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని నల్లగొండ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో 1, 2 అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట- అంగన్వాడీ బాటలో భాగంగా పోషణ వాటిక కార్యక్రమంలో కిచెన్ గార్డెన్ నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో విద్యనందిస్తారని, అలాగే పౌష్టికాహారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ లావణ్య కుమారి, ఏసిడిపిఓ వెంకటమ్మ, సూపర్వైజర్ శిరీష, జడ్.పి.హెచ్.ఎస్ హెచ్ఎం సుభాష్, మహేష్, వీఓఏ స్వరాజ్యం, రిజ్వాన, వీఓ అధ్యక్షురాలు మీరాభి, అంగన్వాడీ టీచర్లు వనజ, సంతోష, యూత్ సభ్యులు రావుల ఎల్లప్ప, మహేశ్, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.