ఆత్మకూరు(ఎం), జూలై 18 : పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సమయానుకూలంగా బస్సులు నడపాలని బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా కో ఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్సుల సంఖ్య తగ్గించడంతో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భువనగిరి, మోత్కూర్, ఘట్కేసర్ ప్రాంతాలకు ప్రతిరోజు విద్యార్థులు వెళ్తుంటారని, సరైన సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ ఆర్థిక ఇబ్బుందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు, అన్ని గ్రామాల స్టేజీల వద్ద బస్సులు ఆపేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో యువజన విభాగం మండలాధ్యక్షుడు ప్రతికంఠం శంతన్రాజు, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు సుంచు నాగరాజు, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గడ్డం సతీశ్‌గౌడ్, ఆత్మకూరు(ఎం) పట్టణాధ్యక్షుడు ఎండీ హైమద్, నర్సింహ్మ, రాజు పాల్గొన్నారు.